సాధారణంగా మనం ఎక్కడికైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ లేని వారిపై చలానా విధించడం మనం చూస్తున్నాము.ఈ విధంగా హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలకు ఎటువంటి హాని జరగదని,తప్పనిసరిగ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అధికారులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నారు.ఈ క్రమంలోనే హెల్మెట్ ధరించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనుల నిమిత్తం హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళుతుండగా పోలీసులు అతనికి జరిమానా విధించారు.ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తన స్కూటీపై రోజులాగే పొలం పనులకు వెళ్ళాడు. అయితే ఆ సమయంలో తను హెల్మెట్ ధరించలేదని 200 రూపాయలు ఫైన్ విధించడంతో రైతు ఎంతో ఆశ్చర్యపోయాడు.
మల్లేశం అనే రైతుకు 200 రూపాయల చలానాతోపాటు యూజర్ ఛార్జ్ 35 రూపాయలు వసూలు చేయడంతో సదరు రైతు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయంపై రైతు స్పందిస్తూ పోలీసులు అన్ని విషయాలలో ఇదేవిధంగా విధులు నిర్వహించాలంటూ పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఇకపై పొలం పనులకు వెళ్లేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,లేకపోతే వారు కూడా ఫైన్ చెల్లించక తప్పదని తెలుస్తోంది