ప్రస్తుతం ఉన్న ఈ కరోనా భయంకరమైన పరిస్థితులలో కరోన బాధితులను చూడాలన్న వారిని పలకరించాలన్న భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తారు. అలాంటిది కరోనా బాధితుల కోసం తమ ప్రాణాలను, తమ కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ ఈ పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ, మునిసిపాలిటీ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన నియమించబడిన ఆశా కార్యకర్తలు సైతం ఈ పోరాటంలో దిగి కరోనాను కట్టడి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఒప్పంద ప్రాతిపదికపైన నియమితులైన ఆశా కార్యకర్తలు వారి ముందు ఉన్న సమస్యలను అధిగమిస్తూనే కరోనా సేవలందిస్తున్నారు.జీతాలు పరంగా అంతంతమాత్రమే చెల్లిస్తున్న ప్రభుత్వం వారు చెప్పిన ప్రతి పనిని 100% నిబద్ధతతో పూర్తి చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కంటెంట్మెంట్ జోన్లలో విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా వ్యాధితో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకునే వారిని ప్రతిరోజు పరామర్శించి వారికి మందులను ఆహారనియమాలను తెలియజేస్తూ, బిపి, ఆక్సిజన్ స్థాయిలు, ఫీవర్ పరిశీలించి నమోదు చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాలలో ఫీవర్ సర్వేలు నిర్వహించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ విధంగా ఈ కరోనా కష్ట సమయంలో మహమ్మారి కట్టడి కోసం మేము సైతం అంటూ ఎంతో మంది కార్యకర్తలు నిత్యం సేవలను అందిస్తున్నారు.