తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను మరింతగా సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఉండేవి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట అదనంగా సడలింపులు ఇచ్చారు. అయితే ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. ఇంకో గంట ఇంటికి వెళ్లేందుకు అదనంగా సడలింపు ఉంటుంది. దీంతో మొత్తం 12 గంటల పాటు సడలింపులు ఉంటాయి. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.
జూన్ 9వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో మంగళవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ సమయం పాటు చర్చించింది. లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా మూడో వేవ్, టీకాల పంపిణీ వంటి అనేక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు నూతనంగా సవరించిన ప్రకారం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుంది.
కాగా జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలను ఇస్తామని మోదీ ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…