Telangana : వారిద్దరూ నగరంలో పేరుమోసిన డాక్టర్లు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ డాక్టర్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు ఉంది. అయితే ఆమెను కూడా డాక్టర్ చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించాలని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పుట్టిన రోజే తన బిడ్డ కాటికి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగి పోయారు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జయ మెటర్నిటీ నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ ఫణికుమార్, జయలలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు నేహ. ఈమె గత ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ ఎంట్రెన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే ఇదివరకు తన పుట్టిన రోజు వేడుకలను తన తల్లిదండ్రులతో కలిసి జరుపుకున్న నేహ మొట్టమొదటిసారిగా తన పుట్టిన రోజు వేడుకలను తన స్నేహితులతో కలిసి గోవాలో జరుపుకుంటానని అడగడంతో అందుకు తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.
ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన నేహ ఎంతో సంతోషంగా శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలను జరుపుకుని తన ఆనందాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. అయితే ఆదివారం ఉదయం నేహకు ఉన్నఫలంగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. ఈ విషయం విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పుట్టిన రోజే మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు తీవ్రమైన దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…