Team India : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు ప్రమోషన్ లభించింది. పంత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పంత్.. ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం అయ్యే వెస్డింటీస్ టీ20 సిరీస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ వైస్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు.
ఇటీవల జరిగిన వెస్డిండీస్ వన్డే సిరీస్‌లో మొదటి వన్డేకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. తన సోదరి వివాహం కోసం అతను మొదటి వన్డే ఆడలేదు. ఇక రెండో వన్డేలో ఆడినా.. ఆ మ్యాచ్‌లో అతను గాయాల పాలయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో మూడో వన్డేకు ఎంపిక కాలేదు. అలాగే టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో పంత్‌ను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా నియమించింది.
కాగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొడ కండరాలు పట్టేయడంతో విండీస్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మధ్యే వన్డేల్లో మళ్లీ ఆడిన కుల్‌దీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో అతనిక టీ20 సిరీస్‌లో చోటు దక్కింది. కాగా భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0 తో కైవసం చేసుకుంది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…