Taraka Ratna : నందమూరి హీరో తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నట్లు తెలుస్తుంది. తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని అంటున్నారు. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మెలేనా అనే వ్యాధితోనూ బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు.
తారకరత్నకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరవాత తారకతర్న కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా అప్పుడు చాలా ప్రకటించిన కూడా కొన్ని సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇటీవల తారకరత్న సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పిస్తున్నాడు. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం తారకరత్నకు దక్కినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎంతో హార్డ్ వర్క్ చేసే తారకరత్న ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోవడానికి కొన్నికారణాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న బక్కపలుచగా ఉన్నాడు కాబట్టి అతడి ఎంట్రీ లుక్ ప్రేక్షకులని అలరించలేకపోయింది. మొదటిసినిమా కోదండరామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ తో చేయగా ఆ తరవాత సినిమాలన్నీ కొత్తదర్శకులతో చేయడం వల్ల మైనస్ అయ్యిందట. అంతే కాకుండా నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తారకరత్నకు బహిరంగంగా ఇవ్వకపోవడం వలన అతనికి మైనస్ అయింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగానే అతడిని నందమూరి ఫ్యామిలీ కొన్నాళ్లు దూరం పెట్టింది.