Tammareddy Bharadwaja : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ పరాజయాల తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ ఆదిపురుష్ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. కానీ ఈ టీజర్ చూసిన అందరూ షాక్ అయ్యారు.
ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే యానిమేషన్ చూస్తున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారని దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను థియేటర్స్ లో విడుదల చేసింది. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్ ను కూడా విడుదల చేస్తామని వెల్లడించింది.
అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్, ట్రైలర్‌పై వస్తున్న ట్రోల్స్ పైన ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ ను చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. రూ. 500 కోట్లు బడ్జెట్‌తో బాలీవుడ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అందరిలోనూ ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది.
కానీ ఈ మూవీ టీజర్ నిరాశ పరిచింది. చూడడానికి యానిమేటెడ్ చిత్రంలా ఉంది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ యానిమేటెట్ చిత్రాన్ని పెద్ద సినిమా అని ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా 3డీలో థియేటర్స్ లో ఎక్స్‌పీరియన్స్ వేరు విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. నాకు తెలిసినంత వరకు 3డీలో చేసిన, 4డీలో చేసిన 2డీలో చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్ యానిమేటెడ్ చిత్రంలా తీశారని అందరూ ట్రోల్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గెటప్‌లు, కాస్ట్యూమ్స్ మారవు కదా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా యానిమేటెడ్ ప్రభాస్‌ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్ వస్తున్నాయి. రాముడిని దేవడిగా కొలిచే మన దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. ఆదిపురుష్ టీమ్ 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే అని భరద్వాజ తెలియజేశారు. సినిమా మంచిగా రావాలనే నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని కాదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…