పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయింది. ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని దక్కించుకుంది. రూ.120 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో విమర్శలతో దాడి చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన యాక్షన్‌ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ కూడా ఉంటుంది. అతిగా ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదుర్కోవలసి వస్తుంది. హీరోలు మా సినిమాను చూడండి అని ప్రమోట్ చేయాలే తప్ప, ఊపేస్తాం.. తగలెడతాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తే ఇదేవిధంగా ప్రేక్షకులు మనల్ని తగలెడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమా డిజాస్టర్‌కు కారణాలు ఏమై ఉంటాయి అని తమ్మారెడ్డి భరద్వాజ్ ను ప్రశ్నించగా, ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను కూడా పూరి జగన్నాథ్ కు పెద్ద అభిమానిని. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే నాకు చిత్రం చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే సినిమా చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. బాయ్ కాట్ ట్రెండ్‌పై భరద్వాజ రియాక్ట్ అవుతూ, ఒక సినిమా వచ్చిందంటే చాలు .. నూటికి 95 శాతం తమ సోషల్ మీడియా లైకుల కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇలాంటి వార్తలను అసలు పట్టించుకోను అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కేవలం ఐదు శాతమే ఉంది. 95 శాతం సినిమాలు ఆడటం లేదన్నారు. ఎంతో మంది నిర్మాతలు పూట గడవని స్థితిలో ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…