చియాన్ విక్రమ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో కోబ్రా మూవీని తెరకెక్కించారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోబ్రా చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. చాలాకాలం పాటు కోబ్రా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు బుధవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న కోబ్రాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
నైజాం, సీడెడ్ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీస్ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఇటీవల కాలంలో విక్రమ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. తెలుగులో అపరిచితుడు మూవీ నుంచి విక్రమ్ కి మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాకి దాదాపుగా రూ.4 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కోబ్రా విడుదలైన రోజు వినాయక చవితి కావడంతో అది మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. మొదటి రోజు తెలుగు మరియు తమిళ్ వెర్షన్స్ లో దుమ్మురేపే కలెక్షన్స్ వచ్చాయి.
టాలీవుడ్ లో ఒక పక్క పవన్ కళ్యాణ్ జల్సా మరియు తమ్ముడు సినిమాల రీ రిలీజ్ మానియాను తట్టుకొని కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది అంటే మాములు విషయం కాదు. మొదటి రోజే ఈ సినిమా తెలుగు వర్షన్ లో 2 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను సాధించింది. అంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని మొదటి రోజే 50 శాతం రీచ్ అయిపోయింది అన్నమాట. మూవీ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా వీక్ డేస్ లో మరిన్ని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతే కచ్చితంగా ఫుల్ రన్ రూ.2 నుంచి 3 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఏదిఏమైనా చాన్నాళ్ల తర్వాత కోబ్రాతో విక్రమ్ కి సాలిడ్ హిట్ పడింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…