Sai Pallavi : తెలుగు తెరపై తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఈమె గ్లామర్ షో చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఈమె తన నటన, డ్యాన్స్‌నే నమ్ముకుని కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో మైత్రి అనే యువతి పాత్రలో సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. దీంతో సాయిపల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే ఈ సినిమాలో సాయిపల్లవి ఏమంత అందంగా లేదని.. కొందరు నెటిజన్లు సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టారు. తమిళంలో ఆ పోస్టు వైరల్ అయింది. దీనికి గాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి తిట్టిన కామెంట్లలో తమిళిసై పేరును కూడా చేర్చారు. సాయిపల్లవి అందంగా లేదని, తమిళిసై ఈ విషయంలో ప్రశాంతంగా ఉండలేరని.. అర్థం వచ్చేలా కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తూ తిట్టారు. దీంతో గవర్నర్ తమిళిసై స్పందించారు.
తనపై, సాయపల్లవిపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. ఓ తమిళ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టడం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. గతంలో తనను కూడా ఇలాగే బాడీ షేమింగ్ చేసేవారని, తన రూపంపై ఇష్టం వచ్చినట్లు తిడుతూ మాట్లాడేవారని, ట్రోల్ చేసేవారని తమిళిసై బాధపడ్డారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధ తెలుస్తుందని, అయినప్పటికీ తన ప్రతిభతో పైకి వచ్చానని, అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని అన్నారు.
అలాంటి కామెంట్లు చేసినప్పుడు బాధ అనిపించే మాట వాస్తవమే అయినా.. వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమని తమిళిసై అన్నారు. పొట్టిగా ముదురు రంగు చర్మంతో లేదా నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంటుంది. అందుకే మన సామెత.. కాకి తన పిల్లను బంగారం అనుకుంటుంది.. దాని రంగు ఏదైనప్పటికీ.. నల్లగా ఉన్నందున తిరస్కరించదు.. అని తమిళిసై అన్నారు.
పురుషులు సాధారణంగా ఎలా ఉన్నా తమ రూపం పట్ల అంతగా విమర్శలను ఎదుర్కోరు. కానీ మహిళలు అందంగా లేకపోతే ఎల్లప్పుడూ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు కూడా యువకులుగా చెలామణీ అవుతుంటారు. కానీ మహిళలు యుక్త వయస్సులో ఉన్నా ఇలాంటి కామెంట్లను అనుభవించాల్సి వస్తుందని.. తమిళిసై అన్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…