Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఐటమ్ సాంగ్స్‌లోనూ నటిస్తోంది. అయితే ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 10 ఏళ్లకు పైనే అయింది. అయినప్పటికీ ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలకు కొదువ ఉండడం లేదు.
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మందన్న, పూజా హెగ్డె, సమంత, కీర్తి సురేష్ వంటి వారికి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో కేవలం సీనియర్ హీరోల సినిమాల్లోనే తమన్నాకు అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కెరీర్ ఇక ముగిసినట్లేనని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుందని కూడా అంటున్నారు.
తమన్నా ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోనుందంటూ ఈ మధ్య కాలంలో వార్తలు బాగా వస్తున్నాయి. అయితే వాటిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. తాను ప్రస్తుతం ఆఫర్లతో బిజీగానే ఉన్నానని.. అందువల్ల మరో 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోనని.. తాను పెళ్లి చేసుకుంటున్నానంటూ కూడా వార్తలు రాయకండి.. అని తమన్నా చెప్పుకొచ్చింది.
ఇక తమన్నా ఇటీవలే నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీలో నెగెటివ్ రోల్‌ను పోషించింది. త్వరలో భోళా శంకర్, ఎఫ్3 చిత్రాల్లో కనిపించనుంది. గతంలో ఈమె మాస్టర్ చెఫ్‌కు కార్యక్రమానికి యాంకర్‌గా కూడా వ్యవహరించింది. అయితే ఖర్చు ఎక్కువ అవుతందని నిర్వాహకులు తమన్నాకు బదులుగా అనసూయను పెట్టారు. అయినప్పటికీ రేటింగ్స్ పెద్దగా రాలేదు. దీంతోపాటు తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని తమన్నా కోర్టుకు కూడా వెళ్లింది.