Flax Seeds Powder : తమ జీవన శైలి బట్టి ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. జంక్ ఫుడ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి పోషకాలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా అధిక బరువు పెరుగుతూ డైటింగ్ వంటి అస్తవ్యస్తమైన ప్రణాళికలతో ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి నరాల బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఈ నరాల బలహీనత వల్ల కాళ్లు, చేతులు వణకడం, తక్కువ బరువు ఉన్న వస్తువులు కూడా మోయలేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు మాటలు తడబడడం, ఏ చిన్న పని చేద్దామన్నా నీరసంగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఈ నరాల బలహీనత అనేది విటమిన్ బి12 లోపం వల్ల ఏర్పడుతుంది. ఈ లోపం నుంచి బయటపడడానికి ఒక మంచి ఇంటి చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ లో 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల బాదం, 10 గ్రాముల దాల్చినచెక్క, 10 గ్రాములు అవిసె గింజలు, 10 గ్రాముల వాల్ నట్స్ వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడకుండా గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకొని భద్రపరుచుకోవాలి. ప్రతి రోజూ అర టీస్పూన్ పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకొని రాత్రి పూట తాగడం ద్వారా నరాలకు శక్తినిచ్చి, బలహీనతను తగ్గిస్తుంది. ఈ పొడిలో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ బి వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పొడిని రోజూ వాడడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…