Dengue Fever : ఈ 5 ఆహారాల‌ను తీసుకోండి.. ఎంత‌టి డెంగ్యూ నుంచి అయినా స‌రే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ కేసులు బాగా నమోదవుతున్నాయి. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ జాతికి చెందిన దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు. ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లను సైతం కలగజేస్తాయి. డెంగ్యూ వ్యాధి అనేది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం వివరాల ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 3-14 రోజులలో కనిపిస్తాయి. చాలా మంది ఒక వారంలోపు కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా కంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, వికారం/వాంతులు, కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి.

Dengue Fever

సరైన సమయంలో డెంగ్యూ వ్యాధికి చికిత్స చేయకపోతే, డెంగ్యూ జ్వరం మీ పరిస్థితిని వేగంగా క్షీణింపజేస్తుంది. అయితే, డెంగ్యూకు మందు లేదా వ్యాక్సిన్ లేదు. వ్యాధికి చికిత్స చేయడానికి ఏకైక మార్గం పారాసెటమాల్ వంటి ఓవర్-ది-కౌంటర్ ఔషధాల ద్వారా లక్షణాలను నియంత్రించడం. కానీ డెంగ్యూ నుంచి కోలుకోవడానికి మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరి అయిన ఆహారం తీసుకోకపోతే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. మరి ఇలాంటి పరిణామాల నుంచి బయట పడాలి అంటే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి మంచి ఫలితం కనిపిస్తుంది.

బొప్పాయి ఆకులలో ఉండే పాపైన్ మరియు చైమోపాపైన్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు గ్యాస్‌ను నయం చేయడంలో సహాయపడతాయి. బొప్పాయి ఆకు రసం డెంగ్యూ జ్వరంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 30ml బొప్పాయి రసం మన శరీరంలో ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడుతుంది. దానిమ్మలో కూడా శరీరానికి శక్తిని అందించే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ మరియు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి అవసరమైన పోషకంగా ఉంటుంది.

డెంగ్యూ వచ్చిన్నప్పుడు శరీరానికి అధికంగా చెమట పడుతుంది. ఈ అధిక చెమట అనేది శరీరం డీహైడ్రేషన్ అయ్యేలా చేస్తుంది. డీహైడ్రేషన్ నుంచి బయటపడాలి అంటే కొబ్బరి నీరు రోగికి సరైన పానీయం. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను నయం చేస్తుంది.  మరియు శరీరానికి శక్తిని అందిస్తుంది. పసుపు యాంటిసెప్టిక్ గా జీవక్రియ బూస్టర్ మరియు డెంగ్యూ జ్వరం సమయంలో త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు వేసి ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు త్రాగాలి. అదేవిధంగా మెంతి ఆకులు లేదా మెంతి గింజలు నిద్రను ప్రేరేపిస్తాయి. డెంగ్యూ జ్వరం వల్ల ఏర్పడిన నొప్పులకు ఇది మంచి నివారిణిగా కూడా పనిచేస్తుంది మరియు అధిక జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM