Cucumber : కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. అలా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే వాటిల్లో కీరదోస ఒకటి. కీర దోస అనేక పోషకాలను కలిగి ఉంటుంది. రోజూ కీర దోసకాయలను తినడం వల్ల ఎన్నో రకాల జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే కీర దోసను ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు. మరి కొందరు వీటిని స్నాక్స్ లా నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కీరదోస ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కీరదోస కాయ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేషన్ సమస్య తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడంలో కూడా ఎంతగానో సహకరిస్తుంది. సాధ్యమైనంత వరకు దోసకాయను చెక్కు తీయకుండా తినటం మంచిది. ఎందుకంటే కీరదోస చెక్కులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కీరదోసకాయను చెక్కు తీసుకోకుండా తినటం వలన ఒక రోజులో శరీరానికి అవసరమైన 10 శాతం విటమిన్ సి అందుతుంది.
నీటి శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బరువు తగ్గాలని అనుకునే వారికి కీరదోసకాయ ఆహారంగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. కీరదోసలో పీచు కూడా అధికంగా ఉంటుంది. మలబద్దకంతో బాధ పడేవారు రోజూ కీరదోసను తీసుకోవటం ద్వారా మలబద్దకం సమస్య చాలా సులువుగా అదుపులోకి వస్తుంది. కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరచడంలో ఎంతగానో సహకరిస్తుంది.
కీరదోసలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి పీచు ఎక్కువగా ఉండటం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులను అదుపులో ఉంచుతుంది. కీరదోసలో విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, ఫోలేట్, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు నిత్యం కీరదోసకాయను క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసుకోని తాగడం వలన ఎముకలకు బలాన్ని కలిగించి కీళ్ళ నొప్పుల సమస్యను దూరం చేస్తుంది. కనుక కీరదోసన రోజూ తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…