Banana Milk : ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

Banana Milk : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో సతమతమవుతుంటే.. మరికొందరు చూడటానికి సన్నగా ఉన్నామంటూ బరువు ఎలా పెరగాలి అంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధిక బరువు మరియు తక్కువ బరువు అనేవి రెండూ సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీరు సమతుల్య బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపదుతుంటారు. ఆరోగ్యకరంగా బరువు పెరగాలి అంటే కండరాలకు బలాన్ని ఇచ్చే పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరం. బరువు పెరగడంలో అరటిపండు అనేది ఎంతగానో సహకరిస్తుంది.

అరటి పండు, పాలు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అరటిపండులో పొటాషియం, విటమిన్లు, డైటరీ ఫైబర్  సమృద్దిగా ఉంటాయి. పాలల్లో కూడా ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం మరియు ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి సహజసిద్ధంగా బరువు పెరగడానికి సన్నగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడ‌తాయి.

Banana Milk

ఒక అరటి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలను పోసి బాగా మిక్సీ చేసుకోవాలి. అలా తయారైన జ్యూస్ ని గ్లాసులో పోసుకుని ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. అరటి పండుతో తయారు చేసిన ఈ పాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. బరువు తక్కువగా ఉన్నవారు ఈ పాలను తాగితే కచ్చితంగా బరువు పెరుగుతారు. అరటిపండు, పాలు రెండింటిలోను కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. అరటిపండ్లలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో గ్లూకోజ్‌ను స్థిరంగా పంపి వర్కవుట్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచి, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. 40 ఏళ్లు పైబడిన వారు ఈ పాలను వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కాబట్టి. చిన్న వయసు వారు ప్రతినిత్యం అరటిపండుతో తయారుచేసిన ఈ పాల‌ను తాగడం ద్వారా త్వరగా ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM