T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో ఒక్క మ్యాచ్ ఓడిపోవడం టీమిండియాకు ప్రాణ సంకటంగా మారింది. నేడు కివీస్‌తో జరగనున్న మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో ఓడితే.. భారత్ ఇంటి దారి పట్టాల్సిందే. సెమీస్ వెళ్లకుండానే వెనక్కి తిరిగి వస్తుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీమిండియాకు చావో, రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లాలంటే ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 స్థానాల్లో ఉన్న రెండేసి జట్లు అర్హత సాధించాలి. ఈ క్రమంలో ఒక్కో టీమ్ ఇతర టీమ్‌లతో 5 మ్యాచ్‌లను ఆడుతుంది. వాటిల్లో నాలుగింటిలో నెగ్గితే సెమీస్‌కు వెళ్లవచ్చు. అయితే పాకిస్థాన్‌తో మనం ఓడిపోవడం, అలాగే న్యూజిలాండ్ కూడా ఓడిపోవడంతో.. పాక్‌కు కలసి వచ్చింది. ఈ క్రమంలో భారత్.. న్యూజిలాండ్‌పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో గెలుపొందిన పాకిస్థాన్ ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు. సెమీస్‌కు వెళ్లిపోతుంది. ఉన్నవి చిన్న జట్లే కనుక పాక్‌కు పెద్దగా కష్టం కాదు. కనుక పాక్ సెమీస్‌కు కచ్చితంగా వెళ్తుందని చెప్పపవచ్చు. అయితే భారత్, కివీస్‌లకు మాత్రం ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
కివీస్‌పై భారత్ గెలిస్తే.. అప్పుడు ఆఫ్గనిస్థాన్, నమీబియా, స్కాట్లండ్‌లతో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో కివీస్ గెలుపు ఒకటి, మిగిలిన మూడు గెలుపులు.. మొత్తం 4 విన్స్‌తో సెమీస్‌కు వెళ్లవచ్చు. అదే కివీస్‌తో ఓడితే.. అప్పుడు ఆ జట్టు సెమీస్‌కు వెళ్తుంది. మనపై కివీస్ నెగ్గాక.. మిగిలిన చిన్న టీమ్‌ల మీద నెగ్గడం న్యూజిలాండ్‌కు పెద్ద కష్టమేమీ కాదు. ఈ క్రమంలో న్యూజిలాండ్ గనక మనమీద గెలిస్తే.. ఆ జట్టు పాక్‌తో కలసి సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. లేదా న్యూజిలాండ్ మీద భారత్ గెలిస్తే.. అప్పుడు భారత్, పాకిస్థాన్‌లు తమ గ్రూప్ నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తం మీద నేడు జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ మనకే కాదు, అటు కివీస్‌కు కూడా ఇంపార్టెంటే అని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…