Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 లో రోజురోజుకీ ఎపిసోడ్స్ పీక్స్ కి చేరుతున్నాయి. లేటెస్ట్ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం మాములుగా లేదు. కెప్టెన్సీ టాస్క్ లో పర్సనల్ గా కూడా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా సన్నీ, అనీ మాస్టర్ ల గొడవ మామూలుగా లేదు. ఇంటి సభ్యులకు పూరీలు చేసే టాస్క్ లో భాగంగా రెండు టీమ్స్ గా విడిపోయారు. అనీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబోలు ఒక టీమ్. మిగిలిన కంటెస్టెంట్స్ సెకండ్ టీమ్. ఇందులో కాజల్ టీమ్ 50 చపాతీలను ఫినిష్ చేశారు. అయితే అవి సరిగ్గా లేవని, అనీ మాస్టర్ టీమ్ ను షన్నూ విన్నర్ గా ప్రకటించాడు.
దీంతో సన్నీ జైలు నుండే ఒకసారి రూల్స్ బుక్ చూడమని, షణ్ముఖ్ కి సలహా ఇస్తాడు. అంతే అనీ మాస్టర్ ఒక్కసారిగా సన్నీపై విరుచుకుపడింది. నీకు నీ ఫ్రెండ్స్ కష్టం తప్ప మిగతావాళ్ళ కష్టం కనిపించదా అంటూ రెచ్చిపోయింది. మాటా మాటా పెరిగి.. మీరు సౌత్.. నార్త్ అంటూ ప్రాంతీయత గురించి గొడవ పడేలా మారింది. వీరిద్దరూ ఇలా తిట్టుకుంటుంటే.. కెప్టెన్ షణ్ముఖ్ ఓ పక్కన కూర్చుని గొడవను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది గమనించిన సన్నీ.. షణ్ముఖ్ తో వాదించాడు.
హా ఏంటిప్పుడు నాకు నవ్వొచ్చింది నవ్వాను.. కొడతావా అంటూ సన్నీని రెచ్చగొడతాడు. అలా వీళ్ళ ముగ్గురి మధ్య మాటలు ఓ స్థాయికి చేరుకున్నాయి. నెక్ట్స్ వీకెండ్ స్పెషల్ లో నాగార్జున ఎంట్రీతో.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు. రవి చేసిన పనికి చీవాట్లు తిన్నాడు. నీ కోసం రూల్స్ మార్చలేమని, నువ్వు ఇక్కడికి డబ్బులు కోసం రాలేదని అన్నావ్.. ఇప్పుడే గేట్స్పె ఓపెన్ చేయిస్తా బయటకు వెళ్ళిపో అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. నెక్ట్స్ అనీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడంపై కూడా ప్రశ్నించారు. సన్నీ ఫోటోను చింపేసి మరీ జైలుకు వెళ్ళాక కూడా నీలో మార్పు లేదని ఫైర్ అయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…