T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 34వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. కేవలం 73 పరుగులకే బంగ్లాదేశ్ కుప్పకూలగా.. ఆస్ట్రేలియా 6.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాపై ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లా జట్టు 15 ఓవర్లలో కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా 5 వికెట్లతో చెలరేగిపోయాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్‌లు చెరో 2 వికెట్లు తీశారు. గ్లెన్ మాక్స్‌వెల్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి సులభంగా టార్గెట్‌ను ఛేదించింది. 6.2 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఆరోన్ ఫించ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఆకట్టుకోగా, మిచెల్ మార్ష్ 16 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లామ్‌లు చెరొక వికెట్ తీశారు.