Swetha Varma : బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారికి ఎన్ని వారాల పాటు అందులో ఉంటే అంత ఎక్కువ డబ్బు వస్తుందనే విషయం తెలిసిందే. ఇక సెలబ్రిటీలకు అందే మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎంత లేదనుకున్నా.. బిగ్ బాస్ షోలో పాల్గొంటే మాత్రం లక్షల రూపాయలు పారితోషికంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు తమకు లభించే ఆ డబ్బుతో తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.
ఇటీవలే లహరి ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసిన విషయం విదితమే. రూ.5 లక్షలు పెట్టి మరీ ఆమె ఆ బైక్‌ను కొన్నది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ కూడా ఓ విలాసవంతమైన బైక్‌ను కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకుంది.
శ్వేతా వర్మ తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన హిమాలయన్ మోడల్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్వయంగా వెల్లడించింది. తనకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని, అందుకనే ఈ బైక్‌ను కొనుగోలు చేశానని ఆమె తెలిపింది.
కాగా కొత్త బైక్‌ను కొన్నందుకు గాను శ్వేతా వర్మకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈమె బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. పచ్చీస్, ది రోజ్ విల్లా, ఏకమ్, ముగ్గురు మొనగాళ్లు, మిఠాయి, మ్యాడ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, సంజీవని, నెగెటివ్ వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇక కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రంలోనూ శ్వేతా వర్మ ఓ పాత్రలో నటించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…