Gamanam Movie : సంజనా రావు దర్శకత్వంలో నటి శ్రియా శరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. గమనం. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్‌లు ఇతర పాత్రల్లో నటించారు. క్రియ ఫిలిం కార్ప్, కలి ప్రొడక్షన్ బ్యానర్లపై రమేష్ కురుటూర, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్, వీఎస్‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
గమనం సినిమాను పలు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. పూర్తిగా భావోద్వేగపూరితమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. డిసెంబర్ 10, 2021వ తేదీన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో శ్రియాతోపాటు నిత్యామీనన్, ఇతర నటీనటుల ప్రదర్శనలకు మంచి మార్కులే పడ్డాయి.
కాగా గమనం మూవీ ఓటీటీలో ప్రసారం కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. జనవరి 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించింది. నిత్యామీనన్ అతిథి పాత్రలో కనిపించింది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ముందుగా తెలుగులో విడుదల చేశారు. త్వరలో హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ మూవీకి డైలాగ్స్ రాశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…