Suriya Jai Bhim : తమిళం హీరోలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి దాడి చేయగా ఆయనపై దాడి చేసిన వారికి వెయ్యి రూపాయల బహుమానం అంటూ.. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో సూర్యపై దాడి చేస్తే లక్ష రూపాయలు బహుమానం అందిస్తామని.. పీఎంకే పార్టీ నేత మైలాడుతురై, జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం ప్రకటించారు.
అయితే ఈ విధంగా ప్రకటన చేయడానికి కారణం ఉంది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలో సూర్య ఒక దళిత వర్గానికి చెందిన మహిళ ఎదుర్కొన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు.. అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 1995వ సంవత్సరంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా చూపించారని.. అల్లర్లు, గొడవలు సృష్టించేలా సినిమా ఉందని.. పీఎంకే పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అలాగే సూర్య ఐదు కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎవరైతే హీరో సూర్యపై దాడి చేస్తారో వారికి రూ.1 లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ పార్టీ అధినేత ఈ విధమై బహిరంగ ప్రకటన చేయడంతో కొందరు ఈ విషయంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యకు చాలా మంది మద్దతు ఇస్తున్నారు.