Surekha Vani : నటి సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అనేక సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఈమెకు ఎక్కువగా కామెడీ పాత్రలే వస్తాయి. ఆ పాత్రలకు తగినట్లుగా ఈమె నటించి అలరిస్తుంటుంది. అయితే సురేఖా వాణి అంటే సినిమాల్లో మనకు కట్టు.. బొట్టుతో సంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది. కానీ అది సినిమాల వరకే. రియల్ లైఫ్‌లో ఈమె గ్లామరస్‌గా ఉంటుంది. అందాలను ఆరబోస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు ఒక రేంజ్‌లో ఉంటాయి. వాటిల్లో ఈమె గ్లామర్‌ను చూస్తే కుర్రకారు తట్టుకోలేకపోతుంటారు.
సురేఖా వాణి ఈమధ్యే తన కుమార్తె సుప్రీతతో కలిసి బ్యాంకాక్‌కు టూర్ వెళ్లి వచ్చింది. అక్కడ వీరు మసాజ్‌లు చేయించుకుంటూ రచ్చ చేశారు. దీంతో వారి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సమయం లభించినప్పుడల్లా ఈ ఇద్దరూ అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే వీరు స్విమ్మింగ్ పూల్‌లో బికినీలు ధరించి ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో సురేఖా వాణి, తన కుమార్తె సుప్రీత ఇద్దరూ బికినీలు ధరించి ఉండడాన్ని చూడవచ్చు. ఇలా వీరు చేసిన గ్లామర్ షోకు యువత గుండెల్లో గుబులు పుడుతోంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఇద్దరూ తెగ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.