Surekha Vani : టాలీవుడ్ లో గ్లామర్ ఉన్న అతికొద్దిమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒకరు. హీరోహీరోయిన్లకు అక్క, వదిన క్యారెక్టర్ లు చేస్తున్నా.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉండే సురేఖావాణి ఎమోషనల్ సీన్ లు, కామెడీ సీన్లలో సైతం నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇటీవలే సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం. వీరిద్దరూ చేసే రీల్స్ కి కుర్రాళ్లు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్పితే సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఈ విషయమై తాజాగా సురేఖవాణి క్లారిటీ ఇచ్చింది. బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ స్వాతిముత్యం. దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో సురేఖవాణి కూడా నటించింది.

ఈ సందర్భంగా మూవీ టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న సురేఖవాణి.. తాను సినిమాలు ఎందుకు చేయట్లేదనే దాని గురించి మాట్లాడింది. చాలా మంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా చేయడానికి..? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు. అలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. నేను సినిమాలు మానేశానని అనుకుంటున్నారు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. స్వాతిముత్యంలో మంచి రోల్ ఇచ్చినందుకు థాంక్స్ అని నటి సురేఖవాణి చెప్పింది.