Suma : తెలుగు బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె గత దశాబ్దాల కాలం నుంచి బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా కొనసాగుతోంది. ఇక వెండితెరపై కూడా జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించబోతుంది. ఇలా కెరియర్లో ఎంతో బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి సుమ చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇదివరకే రాజీవ్.. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు తన భర్తపై వేసే పంచుల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన భర్త రాజీవ్ కనకాల పుట్టిన రోజు కావడంతో సుమ తన భర్తతో కేక్ కట్ చేయించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజీవ్ కనకాల కేక్ కట్ చేసిన అనంతరం తన ఇంటి సభ్యులు సుమను బెదిరించినట్లు తెలుస్తోంది. తన భర్త పుట్టిన రోజు కావడంతో తన కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోమని చెప్పడంతో వెంటనే రాజీవ్ కాళ్ళపై పడి తన ఆశీర్వాదం తీసుకుంది.
ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు సుమ బర్తడే రోజు తన భర్త కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకున్నా సరిపోతుంది కానీ రాజీవ్ బర్త్ డే రోజు నమస్కరించడం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CWNiQjmpRlk/