Suma : సుమ కనకాల.. బుల్లితెరపై ఏ షో అయినా, ఈవెంట్ అయినా మొదటగా వినిపించేది ఈ పేరే. సుమ కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ కి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. అయితే సుమ ఈటీవీ లో క్యాష్ ప్రోగ్రాంలో కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా చేస్తూనే ఉంది. ప్రతివారం సెలబ్రిటీలను తీసుకు వచ్చి వారితో ఆటలు ఆడిపిస్తూ.. ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ క్యాష్ ని రన్ చేస్తుంది. ఎన్నో డైలాగులను గుర్తు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది.
అందుకే క్యాష్ కి ఈ స్థాయిలో రేటింగ్ రావడంతో పాటు ఇన్నాళ్లుగా కొనసాగుతోంది. కేవలం సుమ కోసమే క్యాష్ షో చూసేవాళ్లే ఎక్కువ. క్యాష్ ప్రోగ్రాం కోసం ఇంతలా సుమ కష్టపడుతుంది అంటే ఆమెకు బాగానే పారితోషికం ఇస్తుంటారని మనకు అనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం క్యాష్ ఒక్క ఎపిసోడ్ కు గాను సుమ 5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఐదు లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనంగా 50 వేల రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్షల రూపాయలు ఒక్క ఎపిసోడ్ కు సుమ తీసుకుంటుంది.

అయితే సుమ క్యాష్ ప్రోగ్రాం మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 50 వేల నుండి 70 వేల రూపాయల పారితోషకం తీసుకునేదట, కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎన్నో రెట్లు పెరిగింది. క్యాష్ కార్యక్రమం కాకుండా ఆమె ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంతకు మించి వస్తుంది. కానీ ఆమెకు క్యాష్ కార్యక్రమంతో ఒక అనుబంధం ఉంది. తనను యాంకర్ గా నిలబెట్టి ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది కనుక మల్లెమాల మరియు ఈటీవీ ని వదిలి ఆమె వెళ్లదు. ఓ సందర్భంలో తన పెళ్లి పిల్లలు అన్ని ఈటీవీలో పనిచేస్తుండగానే జరిగిపోయాయి నాకు ఈటీవీతో అనుబంధం చాలా ప్రత్యేకం అని ఆమె చెప్పిన విషయం తెలిసిందే.