Suhana Khan : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల వారసులు తెరపై సందడి చేస్తుంటారు. అయితే వారి లక్ బాగుంటే స్టార్లుగా మారుతారు. లేదంటే ఒకటి రెండు సినిమాలు చేసి వెండితెరకు దూరమవుతుంటారు. అలాంటి వారిని గతంలో మనం చాలా సార్లు చూశాం. ఇక బాలీవుడ్‌లో అయితే చాలా మంది వారసులు ఇప్పటికే వెండి తెరపై అరంగేట్రం చేశారు. కానీ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మాత్రం ఇంకా బాలీవుడ్ కు పరిచయం కాలేదు. అయితే త్వరలోనే ఆమె ఓ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కానుందని తెలుస్తోంది.
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, చుంకీ పాండే కుమార్తె అనన్య పాండేలు ఇప్పటికే హీరోయిన్స్‌గా మారి రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో సుహానా ఖాన్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జోయా అక్తర్.. సుహానా ఖాన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నాడట. ఈ క్రమంలోనే జోయా అక్తర్ ఆఫీస్‌కి సైతం సుహానా వెళ్లింది. వారు తాము చేయబోయే సినిమా కథకు సంబంధించి చర్చలు జరిపారట. దీంతో సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
సుహానా ఖాన్ ఇది వరకే ఓ షార్ట్ ఫిలింలో నటించి అలరించింది. ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ టైటిల్‌తో తెరకెక్కిన సదరు ఫిలింలో ఆమె నటించింది. ప్రస్తుతం లండన్ యూనివర్సిటీలో ఆమె విద్యను అభ్యసిస్తోంది. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి పలు కోర్సులను కూడా ఈమె చేసింది. త్వరలోనే విద్యాభ్యాసం ముగించుకుని సొంత దేశానికి వస్తుందని, దీంతో ఆమె వెండి తెరకు పరిచయం అవుతుందని తెలుస్తోంది. అయితే సుహానా ఖాన్ ఇప్పటికే గ్లామర్‌గా కనిపిస్తూ పలు మార్లు ఫొటోలను షేర్ చేసింది. ఇంకా సినిమాల్లోకి రాకముందే ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంటుంది. మరి సినిమాల్లోకి వచ్చాక ఎలా రచ్చ చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…