Money Earning : రూ.100తో రూ.10.72 కోట్లు సంపాదించవచ్చా ? ఎలా ?

Money Earning : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఉద్యోగులకు తాము చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ఇక చాలా మంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు. కరోనా వల్ల ఎంతో మంది నిరుద్యోగులుగా మారిపోయారు. చాలా మంది ఉపాధిని కోల్పోయారు. కానీ ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించాలనే చూస్తుంటారు. ఆ మాట కొస్తే ఉద్యోగులు మాత్రమే కాదు, కొన్ని కోట్ల రూపాయలను రోజూ సంపాదించేవారు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి పోగు చేయాలని.. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తిని సంపాదించాలని కలలు కంటుంటారు.

Money Earning

అయితే డబ్బు సంపాదించే ఎవరైనా సరే.. కచ్చితంగా ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని చూస్తుంటారు. దీంతో భవిష్యత్తులో వచ్చే ఎమర్జెన్సీ ఖర్చులతోపాటు పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు వంటి వాటికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ డబ్బును ఎంతో కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇక మనకు ప్రస్తుతం డబ్బును పొదుపు చేసేందుకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నింటిలోకెల్లా ఉత్తమమైన రిటర్న్స్‌ను ఇచ్చేది మాత్రం మ్యుచువల్‌ ఫండ్స్‌ సిప్‌ అని చెప్పవచ్చు. సిప్‌ (SIP) అంటే.. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌. మ్యుచువల్‌ ఫండ్స్‌ అనగానే సాధారణంగా చాలా మంది భయపడిపోతుంటారు. కానీ సిప్‌లో ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు. అందులో దీర్ఘకాలం డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డబ్బుకు రక్షణ ఉండడంతోపాటు ఎక్కువ కాలం పొదుపు చేస్తే రిటర్న్స్‌ కూడా ఎక్కువ పొందవచ్చు.

ఉదాహరణకు.. రోజుకు రూ.100 చొప్పున.. అంటే.. నెల‌కు రూ.3000.. ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు మ్యుచువల్‌ ఫండ్స్‌ సిప్‌లో డబ్బును పొదుపు చేస్తే 30 ఏళ్లకు అతను పెట్టిన మొత్తం రూ.10,80,000 అవుతుంది. దీనికి ఎంత లేదన్నా కనీసం 15 శాతం వరకు రిటర్న్స్‌ వస్తాయి. ఈ క్రమంలో రూ.1,99,49,461 వస్తాయి. దీన్ని మన పొదుపుకు కలిపితే అది రూ.2,10,29,461 అవుతుంది.

అయితే ఇదే స్కీమ్‌లో చివరి 3-4 ఏళ్ల సమయంలో మార్కెట్‌లో రిటర్న్స్‌ శాతం పెరిగితే.. అప్పుడు చేతికి వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి రూ.1,56,37,884 అవుతుంది. దీనికి రూ.9,16,19,430 రిటర్న్స్ వస్తాయి. మొత్తం కలిపి రూ.10,72,57,314 అవుతాయి. ఇది ఆన్‌లైన్‌లో లభిస్తున్న SIP టూల్‌ ద్వారా ఒక మ్యుచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో వచ్చే మొత్తాన్ని లెక్కించి చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరికీ రిటర్న్స్‌ రాకపోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా 15 శాతం రిటర్న్స్‌ వేసుకున్నా.. రూ.2,10,29,461 పొందవచ్చు. ఇలా మ్యుచువల్‌ ఫండ్స్‌ SIP ద్వారా మనం పొదుపు చేసుకునే డబ్బులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్‌ పొందవచ్చు.

మ్యుచువల్‌ ఫండ్స్‌ SIPలో డబ్బులు పొదుపు చేయదలిస్తే మీకు అకౌంట్‌ ఉన్న ఏదైనా బ్యాంకులో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వారు అనేక రకాల స్కీమ్‌లను వివరిస్తారు. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలి. ఇక ఇందులో పొదుపు చేసే డబ్బులకు వెంటనే ఫలితాలను ఆశించరాదు. కనీసం 5 ఏళ్ల పాటు పొదుపు చేస్తే ఒక మోస్తరు లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువ సంవత్సరాలు పొదుపు చేస్తే.. సమయం గడిచే కొద్దీ మనకు వచ్చే రిటర్న్స్‌ కూడా పెరుగుతాయి. కనుక SIPలో సుదీర్ఘకాలం పాటు పొదుపు చేస్తేనే ఎక్కువ మొత్తం పొందవచ్చని తెలుసుకోవాలి.

ఇక ఇందులో పలు రకాల స్కీమ్‌లు కూడా ఉంటాయి. అన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల యాప్స్‌లోనూ ఇలాంటి స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తున్నారు. వాటిని కూడా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం స్టాక్‌ మార్కెట్‌, మ్యుచువల్‌ ఫండ్స్‌ నిపుణులను బ్యాంకుల్లో సంప్రదించవచ్చు.

Share
Editor

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM