Sudheer : జబర్దస్త్ అనగానే మనకు ముందుగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అనసూయ, రష్మి.. ఇలా పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ వీరందరూ ఇప్పుడు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. యాంకర్లు అనసూయ, రష్మి తప్పించి ఇప్పుడు కమెడియన్లు అందరూ జబర్దస్త్‌ను వీడిపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ స్కిట్‌లలో కనిపించడం లేదు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపోసిడ్స్‌లోనూ సుధీర్ రావడం లేదు. దీంతో సుధీర్ స్టార్ మా చేస్తున్న ప్రోగ్రామ్‌లకు వెళ్లిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే జబర్దస్త్ లో కమెడియన్స్ కన్నా యాంకర్లకే రెమ్యునరేషన్ ఎక్కువ. సుధీర్‌కు ఇప్పటి వరకు అందులో ఎపిసోడ్‌కు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ స్టార్ మా వారు దీనికి డబుల్ ఇస్తామని ఆఫర్ చేశారట. దీంతో స్టార్ మాకే సుధీర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తమ చానల్‌కు వచ్చేస్తే సుధీర్‌కు ఒక ఎపిసోడ్‌కు రూ.7 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారట. ఇప్పటికే స్టార్ మాలో యాంకర్‌గా చేస్తున్న అనసూయకు ఇస్తున్న మొత్తం కంటే ఇది ఎక్కువే. కనుక సుధీర్ గనుక పూర్తి స్థాయిలో స్టార్ మాకు వచ్చేస్తే అప్పుడు అనసూయకు షాక్ తగిలినట్లే అవుతుంది.
స్టార్ మాలో సూపర్ సింగర్స్ అనే షోతోపాటు కామెడీ స్టార్స్ కు కూడా సుధీర్‌ను అడుగుతున్నారట. కామెడీ స్టార్స్‌కు ఇప్పటికే నాగబాబు జడ్జిగా ఉన్నారు. అయితే సుధీర్ ఓకే చెప్పేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకనే జబర్దస్త్‌లో కనిపించడం లేదని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. ఏది ఏమైనా మల్లెమాలను వీడుతున్న జబర్దస్త్ కమెడియన్లు అందరూ మళ్లీ ఒక్క చోట చేరుతున్నారన్నమాట. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న మాటను ఈ విధంగా వారు నిజం చేయబోతున్నారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…