Sudheer : జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన కమెడియన్.. సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మాదిరిగానే సుధీర్‌ను కూడా నిలబెట్టింది. దీంతో సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. వాటిల్లోనూ సుధీర్ నటించి తన సత్తా ఏంటో చాటాడు. ఇక టీవీ షోలతోనూ అదరగొడుతున్నాడు. అయితే జబర్దస్త్ అయినా.. ఇంకో టీవీ షో అయినా.. సుధీర్, రష్మి జంటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకనే వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు షోలలో చూపిస్తుంటారు. కానీ తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదని.. వీరిద్దరూ ఇది వరకే అనేక సార్లు చెప్పారు. అయితే తాజాగా సుధీర్ ఓ టీవీ షో సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. తన గతాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సుధీర్ టీవీ షోలకు రాకముందు మ్యాజిక్ చేసేవాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. అందుకనే తాజాగా ఓ షోకు చెందిన ప్రోమోలో సుధీర్ తన గతాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. తన బ్రేకప్ వల్లే తాను ఒకరకంగా నిలబడగలిగానని చెప్పాడు. అయితే సుధీర్ ఇంకా ఏం చెప్పాడో తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ తదుపరి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.
ఇక సుధీర్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతనిపై షోలలో జోకులు వేస్తుంటారు. అతను ఒక అమ్మాయిల పిచ్చి వాడిగా కనిపిస్తాడు. అయితే వాస్తవానికి అది షోలకే పరిమితం. సుధీర్ ఒక బ్రేకప్ స్టోరీ ఉందని చాలా మందికి తెలియదు. దాని వల్లే అతనిలో మార్పు వచ్చింది. ఇంత పెద్ద కమెడియన్ అయ్యాడు. సక్సెస్ బాట పట్టాడు. అందువల్లే సుధీర్ ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోలేదని కూడా తెలుస్తోంది. అయితే సుధీర్ ఇంకా ఏయే విషయాలు చెప్పాడు.. అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే షో ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…