Bellamkonda : బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ మంచి సక్సెస్‌ని అందించలేకపోయాయి. ఆ మధ్యలో వచ్చిన ‘రాక్షసుడు’ అనే సినిమా ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో సూపర్‌హిట్ సాధించిన ‘రాట్‌సన్’ సినిమా రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను కూడా బెల్లంకొండ చేస్తున్నారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు దొంగ అయినా కూడా స్థానికులు ఆయన్ను ఓ హీరోగా కీర్తించేవారు. పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు కొన్ని వందల సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు స్టూవర్ట్‌పురం దొంగ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో బెల్లంకొండ షాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అసలు సిసలైన దొంగగా కనిపిస్తూ భయపెట్టిస్తున్నాడు.