Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు.
2011 సంవత్సరంలో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించి సక్సెస్ ను అందుకుంది. ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు అందరి తో జత కట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో ఓబులమ్మ అనే డీగ్లామరస్ రోల్ లో నటించింది రకుల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. కొండపొలం చిత్రం తర్వాత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించడం లేదు. తెలుగు చిత్రలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ చిత్రాలకు దగ్గర అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో థాంక్యూ గాడ్ చిత్రంలో కూడా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 మరియు లేడీస్ నైట్ అనే చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…