SS Thaman : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఏ మాత్రం ఖాళీ లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్ఎస్ తమన్ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతున్న తమన్.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికీ మ్యూజిక్ కంపోజ్ చేశానని అయితే తనకు ప్రభాస్ తో కలిసి పనిచేసే అవకాశం ఇంత వరకు రాలేదని తెలిపారు. ప్రభాస్ నటించిన రెబల్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ సినిమాకి లారెన్స్ సంగీతం అందిస్తారని తెలియజేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను.
ఇక అప్పటి నుంచి ప్రభాస్ సినిమాకు సంగీతం అందించే అవకాశం రాలేదని, అందుకు గల కారణం తాను వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని ఈ సందర్భంగా తమన్ తెలియజేశారు. ఇక ఫ్యూచర్ లో ప్రభాస్ సినిమాకు కచ్చితంగా సంగీతం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.