SS Rajamouli : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఆకాశ్ మంచి హిట్ ఒక్కటి కూడా సాధించలేదు. ఈ క్రమంలో అతను కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘రొమాంటిక్’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
అనిల్ పాడూరి దర్శకత్వంవహించిన ఈ సినిమాలో వాస్కోడిగామా అనే యువకుడిగా ఆకాశ్ మాస్ పాత్రలో నటించాడు. కేతికాశర్మ కథానాయికగా నటించింది. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన స్టార్ సెలబ్రిటీల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో రొమాంటిక్ సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు.
రాజమౌళి దంపతులు, అనిల్ రావిపూడి, బాబీ, గోపిచంద్ మలినేని, మెహర్ రమేశ్, హరీష్ శంకర్, బొమ్మరిల్లు భాస్కర్, మోహన కృష్ణ ఇంద్రగంటి, గుణశేఖర్, అలీ, ఆనంద్ దేవరకొండ, విశ్వక్ సేన్ తదితర ప్రముఖులు ప్రీమియర్ షోను వీక్షించి చిత్రం బాగుందని కితాబిచ్చారు.
ప్రీమియర్ షో చూశాక రాజమౌళి స్పందిస్తూ ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ‘ముసలోడివై పోయావ్…నీకెం తెలుస్తుంది’ అని యూత్ అంతా గొడవపడతారేమోనని భయంగా ఉంది. దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించాడు. మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా అతడిని మరో మెట్టు పైకెస్తుందని అన్నాడు రాజమౌళి. ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికాడని కూడా అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…