SS Rajamouli : ఏపీలో గత కొద్ది నెలలుగా నెలకొన్న సినిమా టిక్కెట్ల ధరల విషయానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడిందనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అయితే జగన్‌తో సమావేశం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో టిక్కెట్ల ధరలపై పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని, అందరూ శుభవార్త వింటారని అన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నాయి.
ఇక జగన్‌తో సమావేశం అనంతరం దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. సినీ పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, అవే సమస్యలను సీఎం జగన్‌కు వివరించామని అన్నారు. ఈ విషయంలో చిరంజీవి కృషి ఎంతో ఉందన్నారు. ఆయన అందరినీ సమన్వయం చేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూశారని, కనుక ఇండస్ట్రీకి ఆయనే పెద్ద అని అన్నారు.
సీఎం జగన్‌తో చిరంజీవికి సాన్నిహిత్యం ఉందని, అందుకనే చిరంజీవి ఇంతలా శ్రమించి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారని.. అందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. రాజమౌళి అన్నారు. అయితే చిరంజీవి జగన్‌ను కలుస్తున్నందుకు గుర్రుగా ఉన్న మోహన్ బాబు వర్గీయులు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…