Deepika Padukone : బాలీవుడ్ నటి దీపికా పదుకొనె పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన గెహ్రాయియా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అనన్య పాండే మరో కథానాయికగా నటించింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీపికా పదుకొనె తన మనసులో మాట చెప్పింది. తెలుగులో ఏ హీరోలతో యాక్ట్ చేసేందుకు ఇష్టపడతారు.. అని అడగ్గా.. అందుకు దీపికా సమాధానం చెప్పింది.
ఎన్‌టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలసి నటించాలని ఉందని దీపికా పదుకొనె తెలియజేసింది. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఫుటేజ్ చూశానని.. అద్భుతంగా యాక్ట్ చేశారని, అలాంటి నటుడితో నటించాలని ఎవరికైనా ఉంటుందని పేర్కొంది.
ఇక ఎన్‌టీఆర్ యాక్టింగ్ స్టైల్‌కు తాను ఫిదా అయ్యానని దీపికా తెలియజేసింది. అలాగే అల్లు అర్జున్ అంటే ఇష్టమని కూడా చెప్పింది. పుష్ప సినిమాలో ఆయన యాక్టింగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చింది. ఈ క్రమంలోనే తాను ఎన్‌టీఆర్, అల్లు అర్జున్‌లతో నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇక దీపికా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె అనే మూవీలో నటిస్తుండగా.. ప్రభాస్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
ప్రభాస్ ఒక ట్రూ జెంటిల్మన్ అని, ఆయన అందరితోనూ ఎంతో స్నేహంగా ఉంటారని చెప్పింది. ఆయన ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారని స్పష్టం చేసింది. ఆయన మర్యాదలకు తాను పడిపోయానని, ఆయన అతిథులుకు పెట్టే ఫుడ్ చాలా బాగుంటుందని, అందుకు తానే ఫిదా అయ్యానని.. దీపికా పదుకొనె తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…