SS Rajamouli : దర్శకుడు రాజమౌళి అంటే చాలా మందికి గౌరవం ఉండేది. కానీ ఆయన తాజాగా చేసిన ట్వీట్లు ఆయన గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయి. ఆయన ఒక ఉద్దేశంతో ట్వీట్లు చేశారు. కానీ ఆయనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
దర్శకుడు రాజమౌళి తన బాహుబలి టీమ్‌లో పనిచేసిన దేవిక అనే మహిళ గురించి ట్వీట్ చేశారు. ఆమె తన ప్రొడక్షన్ వర్క్స్‌లో బాహుబలి సినిమాలకు పనిచేసిందని, అయితే దురదృష్టవశాత్తూ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని.. కనుక మనస్సున్న వారు, దాతలు సహాయం చేయాలని కోరుతూ రాజమౌళి లింక్‌ను షేర్ చేశారు. అయితే ఆయన చేసిన ట్వీట్ రివర్స్‌లో ఆయనకే తగిలింది.
రాజమౌళి చేసిన ట్వీట్ల పట్ల నెటిజన్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్క సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటారు కదా. పైగా ఆమె మీ ప్రొడక్షన్ టీమ్‌లో సభ్యురాలు అన్నారు. కనుక మీరే ఆమెకు సహాయం చేయవచ్చు కదా. రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మీకు రూ.3 కోట్లు లెక్క కావు కదా.. అందుకు మమ్మల్ని సహాయం చేయమని క్యాంపెయిన్ రన్ చేయడం ఎందుకు ? ఆ డబ్బేదో మీరే ఇవ్వవచ్చు కదా.. అని చాలా మంది రాజమౌళిని విమర్శిస్తున్నారు.
ఇక కొందరు అయితే.. రాజమౌళి చాలా స్వార్థపరుడని.. తన దగ్గర పనిచేసే వ్యక్తికి సహాయం అందించాల్సింది పోయి.. ఇలా అందరినీ డబ్బులు అర్థించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రూ.4 కోట్లు ఇచ్చారు. ఆయనకు చెబితే సరిపోతుంది కదా.. సహాయం చేస్తారు.. అని కొందరు కామెంట్లు చేశారు.
https://twitter.com/ssrajamouli/status/1487284907839655938?s=20
కాగా.. మీకు ఎంతో మంది దర్శకులు, హీరోలు, చాలా మంది నిర్మాతలు తెలుసు. అందరికీ ఒక మాట చెబితే.. అందరూ ఎంతో కొంత విరాళం ఇస్తారు కదా.. దాంతో దేవికకు సహాయం చేయవచ్చు. అదిపోయి అందరినీ విరాళాలు అడగడం ఏమిటి ? మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు.
రాజమౌళి చేసిన ట్వీట్లు ఇలా ఆయనకే రివర్స్‌లో తగులుతాయని ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆయన చేసిన పనికి ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారు.