Srivalli Sarees : పుష్ప క్రేజ్ మామూలుగా లేదు.. ద‌స‌రా పండుగ అని శ్రీ‌వ‌ల్లి చీర‌లు అమ్ముతున్నారు..

Srivalli Sarees : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  రూపొందించిన చిత్రం  పుష్ప. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. అంతేకాకుండా పుష్ప ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో బన్నీ పెర్ఫార్మన్స్ కు ఇండియా వైడ్ గా అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ చిత్రం విడుదలకు ముందే అందర్నీ ఆకట్టుకున్నాయి.  ఈ చిత్రం డైలాగ్స్ ని, సాంగ్స్ ని అనుకరిస్తూ యువత చేసిన వీడియోలతో సోషల్ మీడియాలు దద్దరిల్లి పోయాయి.

పుష్ప చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి అభిమానులు పెరిగిపోయారు. పుష్ప కి ఉన్న క్రేజ్ ని ప్రస్తుతం అందరూ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్లు కూడా వచ్చాయి. జనాలలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ను వినియోగించుకొని వ్యాపారులు తమ డిమాండ్ ను పెంచుకోవడం కోసం మార్కెట్లో పుష్ప టీషర్ట్స్, షర్ట్స్ కూడా తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు.

Srivalli Sarees

ఈ చిత్రంలో ఐకాన్  స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. రష్మిక కూడా తన అద్భుతమైన నటనతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతోపాటు వరుస బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రష్మిక ధరించిన కాస్ట్యూమ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఇదే క్రేజ్ తో వ్యాపారులు ఇప్పుడు ఏకంగా చీరలను కూడా డిజైన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలో రష్మిక రారా సామి అనే పాటలో ధరించిన గ్రీన్ బ్లౌజ్ అండ్ రెడ్ శారీతో చేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆ శారీలను  శ్రీవల్లి శారీస్ పేరిట మార్కెట్లో సేల్ చేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం పండుగ సమయం కావడంతో మ‌హిళ‌లు కూడా శ్రీవల్లి శారీస్ ను కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజస్థాన్ లో ఈ శారీస్ ఇప్పటికే దుకాణాల్లో సేల్స్ కి వచ్చేశాయి. సోషల్ మీడియాలో కూడా శ్రీవల్లి శారీస్ కు సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

మొదటి పార్ట్ పుష్ప ది రైస్  బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో.. రెండో పార్ట్ పుష్ప ది రూల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక పుష్ప 2 లో మరిన్ని క్యారెక్టర్లు కూడా యాడ్ చేయనున్నట్టు తెలిపారు మూవీ మేకర్స్. ఇటీవల గ్రాండ్ గా పుష్ప పార్ట్ 2 పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నెలలోనే పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM