Sri Reddy : నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తోంది. అయితే సమాజంలోని సంఘటనలపై ఈమె ఈమధ్య పెద్దగా స్పందించడం లేదు. ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తరువాత నటి కల్యాణి వివాదంపై స్పందించింది. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది. తరువాత ఎవరిపై కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. కానీ తన వంటల వీడియోలతో మాత్రం అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు నాన్ వెజ్ వంటకాలను వండుతూ అలరిస్తోంది. ఇక తాజాగా మరో వంటకంతో శ్రీరెడ్డి నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి తన లేటెస్ట్ వీడియోలో బోటికూర వండింది. తనదైన స్టైల్‌లో డైలాగ్స్ చెబుతూ.. బోటిని క్లీన్ చేసింది. తరువాత దాన్ని యమ ఘాటుగా వండింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే భారీగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈమధ్య కాలంలో శ్రీరెడ్డి రెస్టారెంట్లకు సైతం వెళ్తోంది. అక్కడ వంటలను రుచి చూస్తూ రివ్యూలు కూడా ఇస్తోంది. ఓ రెస్టారెంట్‌కు ఈమె 10 కి 10 మార్కులు ఇవ్వగా.. ఇంకో రెస్టారెంట్‌కు 6 మార్కులే ఇచ్చింది. అలాగే నగల దుకాణానికి వెళ్లి ఇటీవలే భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. పైగా పవన్ ను ఎప్పటికప్పుడు తిడుతుండడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి తనకు ముప్పు ఉందని భావించిన ఆమె చెన్నైలో ఉంటోంది. అక్కడి నుంచే వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ మధ్యే చెన్నైలోని ఓ యూట్యూబ్ చానల్‌తో కలిసి అర్థరాత్రి రహదారులపై ద్విచక్ర వాహనాలను ఆపి హల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్‌గా ఈమె పెట్టిన బోటి కూర వీడియో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు అద్భుతంగా కూర వండావని ఆమెను అభినందిస్తున్నారు. ఆ కూరను చూస్తుంటే తమకు కూడా తినాలని ఉందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…