Samantha : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో సమంత చేసిన ఊ.. అంటావా.. పాటకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. చాలా మంది ఈ పాటకు ఇప్పటికే స్టెప్పులు వేసి తమ సరదాను తీర్చుకున్నారు. ఎంతో మంది సెలబ్స్ కూడా ఈ పాటకు డ్యాన్స్‌లు చేశారు. అయితే తాజాగా మళ్లీ సమంత ఈ పాటకు స్టెప్పులేసి అలరించింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన డ్యాన్స్ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఇక విషయం ఏమిటంటే..
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ఓ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాఫీ విత్ కరణ్ అనే షోకు ఈయన హోస్ట్‌గా ఉన్నారు. ప్రస్తుతం 7వ సీజన్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌కు తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా రణవీర్ సింగ్, ఆలియా భట్‌లు వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. ఇక గురువారం జూలై 21న మూడో ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సమంత, అక్షయ్ కుమార్‌లు గెస్ట్‌లుగా రాగా.. వీరి ఎపిసోడ్‌కు చెందిన ప్రోమోను లేటెస్ట్‌గా విడుదల చేశారు. ఇందులోనే సమంత.. అక్షయ్‌తో కలిసి ఊ.. అంటావా.. పాటకు స్టెప్పులేసి అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూడాలంటే గురువారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అయితే ఇందులో సమంత కరణ్ జోహార్ వేసే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతుందా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో దర్శకుడిగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన తెరకెక్కిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్, ఆలియా భట్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2023లో వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…