Sri Reddy : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తనకు నచ్చిన వంటలను చేస్తూ ఆ వీడియోలను ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. అలాగే నచ్చిన ప్రదేశాలకు టూర్లకు కూడా వెళ్తోంది. ఇటీవలే ఆమె గోవాలో సందడి చేసింది. అక్కడ ఎన్‌టీఆర్‌కు ఇష్టమైన ప్రదేశాలు ఇవే.. అంటూ ఆమె టూర్‌లో తిరిగి ఆయా ప్రదేశాలను చూపించింది. ఇక తాజాగా మరోసారి ఇంకో వంట వీడియోతో మన ముందుకు వచ్చింది. ఈసారి ఆమె కుండ బిర్యానీ వండి అలరించింది.
సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా కుండ బిర్యానీ వండింది. అది భీమవరం కుండ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఆ బిర్యానీని వండిన శ్రీరెడ్డి దాని వీడియోను పోస్ట్ చేయగా.. అది యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. శ్రీరెడ్డి కుండ బిర్యానీ అద్భుతంగా ఉందని.. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. తమకు కూడా ఆ బిర్యానీ కావాలని ఆమెను అడుగుతున్నారు.
ఇక శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై కూడా ఆమె స్పందిస్తోంది. దీంతో ఆమె కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇక శ్రీరెడ్డి ఈ మధ్య మెగా డాటర్ నిహారికపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె డ్రగ్స్ కేసులో చిక్కుకుపోవడంతో కుమార్తెను ఇలాగేనా పెంచేది నాగబాబు అంటూ తీవ్ర స్థాయిలో ఆయనపై ఆమె విమర్శలు చేసింది. కానీ నాగబాబు కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనను విమర్శించే వాళ్లకు ఆయన ఒక్క వాక్యంతో సమాధానం చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే నిహారిక మళ్లీ ఇప్పుడు బయటికి వచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…