Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరు నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో శ్రీరెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శన చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి కూడా చెబుతూ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఇప్పటివరకు ఈమె ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసి అందరికీ తన స్టైల్ లో వంటలు ఎలా చేయాలో చూపించింది. శ్రీరెడ్డి వంట చేసేప్పుడు కూడా ఆ అందాల ఆరబోత ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కింగ్ చేప పెద్ద సెన కూర వండింది. ప్రకృతి నడుమ పలు ముచ్చట్లు చెబుతూ ఈ కూర వండింది. ఆ తయారీ విధానం వివరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.

అయితే కొందరు పబ్లిక్‌లోకి వెళితే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని అడుగుతున్నారట. దానికి స్పందించిన శ్రీరెడ్డి.. అంతా కనిపించేలా వేసుకోవద్దని పేర్కొంది. డ్రెస్ ల వల్లే రేపులు జరుగుతున్నాయి అని నేను అనను కానీ సమాజంలో మర్యాద ఉండదు అని చెప్పుకొచ్చింది. నేను షూటింగ్ సమయంలో మాత్రమే అలా చేస్తాను. బయట అన్నీ కవర్ చేసుకుంటాను అని చెప్పింది. అయితే ఒకప్పుడు మేం అలా చేసి చెడిపోయాం. మీరు చెడిపోవద్దని హితబోధ చేసింది శ్రీరెడ్డి. ఈ అమ్మడు చెప్పిన ముచ్చట్లకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఈమధ్యే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలో శ్రీరెడ్డి శ్రీకాంత్‌కు మద్దతుగా నిలిచింది.