Sri Reddy : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తుంటుంది. నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు శ్రీరెడ్డి స్పందించింది. నాగబాబుపై తీవ్ర విమర్శలు చేసింది. నువ్వు తెల్లారితే నీతులు చెబుతావు, కుమార్తెను సరిగ్గా పెంచడం రాదా.. అని వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు స్పందించేందుకు అలాంటి సమస్యలు ఏవీ లేవు. వేరే ఏ ఇతర సంఘటనలు కూడా జరగడం లేదు. కానీ ఈ మధ్య కరాటే కల్యాణి విషయంలో ఫైర్ అయింది. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్‌ను ఇచ్చింది. కల్యాణి తోలు ఒలుస్తా.. అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. ఇక శ్రీరెడ్డి యూట్యూబ్‌లో ప్రస్తుతం వంటల వీడియోలతో అలరిస్తోంది.
యూట్యూబ్‌లో శ్రీరెడ్డి ఇప్పటికే ఎన్నో రకాల వంటల వీడియోలను చేసింది. పీతలు, చేపలు, చికెన్, మటన్ వంటి వెరైటీలను వండి అలరించింది. ఇప్పుడు తాజాగా పనస కాయలను ఎలా వండాలో చేసి చూపించింది. చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని పనస కాయను ఎలా కోయాలో చూపించింది. తరువాత దాన్ని ఎలా వండాలో చెప్పింది. సరైన పదార్థాలను సరైన మేళవింపుతో వేస్తే ఈ కూర చక్కగా వస్తుందని శ్రీరెడ్డి తెలియజేసింది.

ఇక ఈ వీడియో చేసిన సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తనను యూట్యూబ్ వీడియోలకు పెట్టే కామెంట్లలో అక్కా అని పిలుస్తారని.. కానీ వారే ఇతర సామాజిక మాధ్యమాల్లో తిడతారని శ్రీరెడ్డి చెప్పింది. ఇలా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించింది. అలాగే తనదైన ఆంధ్ర యాసతో శ్రీరెడ్డి ఆకట్టుకుంది. కాగా ఆమె పనస కాయ కూరకు చెందిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది కూరను అద్భుతంగా చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.