Sri Reddy : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈమె తనకు నచ్చని సంఘటనలు జరిగినప్పుడు లేదా ఎవరైనా తనకు నచ్చని వారు మాట్లాడినప్పుడు వారిపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. అయితే శ్రీరెడ్డి ఈ మధ్య వివాదాలకు దూరంగా తన పనేంటో తాను చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఎక్కువగా ఆమె వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.

ఇక తాజాగా శ్రీరెడ్డి చేపల కూర వండి అనాథలకు వడ్డించింది. తనలోనూ మానవత్వం ఉందని నిరూపించుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె మటన్, నాటుకోడి, పీతలు.. తదితర వంటలను వండి వాటికి చెందిన వీడియోలను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్‌గా ఈమె పోస్ట్ చేసిన చేపల కూర వీడియో కూడా వైరల్ అవుతోంది. దీనిపై చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
శ్రీరెడ్డి చేపల కూరను వండి అనాథలకు పెట్టిందని చాలా మంది ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమెకు చాలా మంచి మనస్సు ఉందని కితాబిస్తున్నారు. ఇక శ్రీరెడ్డి ఇటీవలే గోవా టూర్ వేసింది. అక్కడ ఆమె అనేక ప్రదేశాలను చుట్టింది. దాని తాలూకు వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. అది కూడా వైరల్ అయింది. అలాగే అందానికి సంబంధించిన చిట్కాలను కూడా ఆమె వీడియోల్లో చెబుతుంటుంది. దీంతో ఆమె వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.