Nagarjuna : బిగ్ బాస్.. ఎంత పాపులర్ షోనో.. అంతే వివాదాస్పదం అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా బిగ్ బాస్ షోను ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో దీన్ని వ్యతిరేకించే సంప్రదాయవాదులున్నారు. సీపీఐ నారాయణ లాంటి వారైతే బిగ్ బాస్ ను బ్రోతల్ హౌస్ అనేశాడు. ఇటీవల బిగ్ హౌస్ లో ఉన్న వాళ్లకు గుండు కొట్టించండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి బిగ్ బాస్ ను వ్యతిరేకిస్తోంది.
అప్పట్లో ఫిల్మ్‌ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం రేపిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ తో పర్సనల్ గా దిగిన ఫోటోలను బయటపెట్టి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో యూ ట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె తెలుగు బిగ్ బాస్ షో గురించి హాట్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా ? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది. చస్తే బిగ్ బాస్ కు వెళ్లను అని స్పష్టం చేసింది. బిగ్ బాస్ కు వెళ్లి పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చింది.

నాలుగు రాళ్లు వెనకేసుకొని ఇల్లు కొనుక్కోగలరేమో కానీ.. పరువు, క్యారెక్టర్ పోగొట్టుకొని బయట నిలబడిన ఎంతో మంది ఉన్నారని.. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా తాను బిగ్ బాస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని.. నాగార్జున అసలు ఎలా ఒప్పుకొని ఈ షో చేస్తున్నారో అంటూ విమర్శించింది. నాగార్జున మీసాలకు, జుట్టుకు రంగు వేసుకొని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్లు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా ? అని ఘాటుగా ప్రశ్నించింది. ప్రస్తుతం నాగార్జునపై, బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగార్జున దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.