Sri Reddy Chicken Lollipops : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేస్తున్న రచ్చ ఈ మధ్యకాలంలో మామూలుగా ఉండడం లేదు. ఈ అమ్మడు గతంలో సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై స్పందిస్తూ ఉండేది. ముఖ్యంగా నాగబాబు కుమార్తె విషయంలో ఈమె ఆయనను తీవ్రంగా విమర్శించింది. అయితే ఇప్పుడు ఆ జోరును కనబరచడం లేదు. కానీ సోషల్ మీడియాలో తన సొంత పోస్టులతో బిజీగా మారింది. ఎల్లప్పుడూ అందులో వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల వంటకాలను శ్రీరెడ్డి వండి అలరించింది. చికెన్, మటన్, పీతలు, చేపలు.. ఇలా పలు నాన్‌వెజ్ వంటలతో శ్రీరెడ్డి అదరగొట్టేసింది.
శ్రీరెడ్డి యూట్యూబ్‌లో వంటల వీడియోలు మాత్రమే కాకుండా పలు రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ ఫుడ్‌ను టేస్ట్ చేసి వాటికి రివ్యూలను కూడా ఇస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇటీవలే రెండు రెస్టారెంట్స్‌కు సైతం వెళ్లింది. ఒక రెస్టారెంట్‌లోని ఫుడ్‌కు 10కి 10 మార్కులు ఇవ్వగా.. ఇంకో రెస్టారెంట్‌లో మాత్రం 10కి 6 మార్కులనే ఆమె ఇచ్చింది. అలాగే ఇటీవలే ఆమె ఓ బంగారం షాపుకు వెళ్లి భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసింది. తాను ఏదో కొద్దిగా బంగారం కొందామని వెళితే తనతో షాపు మొత్తాన్ని వారు కొనిపించారని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయింది. ఇక తాజాగా శ్రీరెడ్డి మరో వంట వీడియోతో మన ముందుకు వచ్చింది. ఆమె చికెన్ లాలిపాప్స్‌ను వండింది.
శ్రీరెడ్డి చికెన్‌ను శుభ్రంగా కడిగి వాటికి మసాలాలు అన్నీ పట్టించి వాటితో లాలిపాప్స్ చేసింది. మనకు బయట సహజంగానే ఇవి రెస్టారెంట్లలో లభిస్తాయి. ఇళ్లలో వీటిని తయారు చేసుకోవడం తక్కువ. కానీ వీటి టేస్ట్ భలేగా ఉంటుంది. ఇక వీటి తయారీ విధానాన్ని ఆమె వివరిస్తూ వీటిని వండేసింది. దీంతో శ్రీరెడ్డి వండిన చికెన్ లాలిపాప్స్ చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి. కాగా ఈ లాలిపాప్స్ అంటే తన బావకు ఎంతగానో ఇష్టమని ఆమె తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈమె లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…