Shobana : అలనాటి అందాల తార శోభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మంచి నటి మాత్రమే కాదు, నృత్యకారిణి కూడా. చక్కగా నాట్యం చేస్తుంది. నటనతోనే కాకుండా తన డ్యాన్స్‌తోనూ ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. అప్పట్లో అనేక మంది అగ్రహీరోలతో ఈమె యాక్ట్ చేసింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, వెంకటేష్, మోహన్‌బాబులతోనూ ఈమె నటించింది. అలాగే తెలుగు, మళయాళం, తమిళం, హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇక అప్పట్లో వచ్చిన రజనీకాంత్ చంద్రముఖి సినిమాకు మూలమైన మళయాళ సినిమా మణిచిత్రతాళులో అద్భుతంగా యాక్ట్ చేసి అవార్డును కూడా దక్కించుకుంది.
ఇక శోభన మొత్తం 4 భాషల్లోనూ కలిపి దాదాపుగా 200కు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఈమె ఉన్నట్లుండి సడెన్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఇందుకు బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో పేరున్న ఓ హీరో ఈమెను లైంగిక వేధింపులకు గురి చేసేవాడట. దీంతో అతని ఇబ్బందులను తట్టుకోలేని ఈమె సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుందట. కేవలం అతని వల్లే శోభన సినిమాలకు దూరమైందట. అతను బాగా పేరున్న హీరో కనుక మీడియా కూడా ఆయన పేరు బయట పెట్టలేకపోయింది. ఈ కారణాల వల్లే శోభన సినిమాలకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.
అయితే శోభన అప్పుడప్పుడు నాట్య ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఈమె చేసే నాట్యాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం నిజంగా అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే కారణాలు ఏమున్నప్పటికీ చాలా మంది అప్పటి హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రల్లో లేదా ఇతర క్యారెక్టర్లలో నటిస్తున్నారు. కానీ శోభన మాత్రం పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…