Sri Reddy : సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్య ఈమె సామాజిక అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. తన పనేదో తాను చేసుకుపోతోంది. చివరిసారిగా ఈమె నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై తెర మీదకు వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఏ ఇష్యూపై కూడా స్పందించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తూనే ఉంది. తన సొంత పనులతో బిజీగా మారింది. ఇక ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటూ.. అక్కడి నుంచే తన కార్యకలాపాలను చక్కబెడుతోంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతో బిజీగా మారింది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వంటలు మాని రెస్టారెంట్‌లకు తిరుగుతూ అక్కడ ఉండే ఫుడ్‌ను టేస్ట్ చేసి వాటికి రివ్యూలు ఇస్తోంది. ఇటీవలే ఓ రెస్టారెంట్‌లో సందడి చేసిన ఈమె అక్కడి ఫుడ్‌కు 10కి కేవలం 6 మార్కులే ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇంకో రెస్టారెంట్‌కు వెళ్లి అన్ని నాన్‌వెజ్, వెజ్ వంటకాలను రుచి చూసింది. అక్కడ కొన్ని వంటకాలకు ఈమె 10కి 10 మార్కులు ఇవ్వగా.. కొన్నింటికి మాత్రం 6 మార్కులనే ఇచ్చింది.

ఇక శ్రీరెడ్డి ఈ మధ్య వంటల వీడియోలతోనే ఎంతో బిజీగా ఉంటోంది. సమాజంలో అనేక సంచలన సంఘటనలు జరుగుతున్నా వాటిని ఈ అమ్మడు పట్టించుకోవడం లేదు. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతో పాపులర్ అయింది. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం సంచలనంగా మారింది. తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు పవన్‌ను తిట్టింది. ఆ తరువాత పవన్ అభిమానుల సెగకు కొంతకాలం అందరికీ కనిపించకుండా జీవించింది. ఆ తరువాత మళ్లీ యథావిధిగా తన పనులను చేయడం ప్రారంభించింది. అయితే ఈమె సామాజిక అంశాలపై ఎందుకు స్పందించడం లేదు.. అని కొందరు సందేహిస్తున్నారు. మరి శ్రీరెడ్డి దీనిపై ఆలోచిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.