Sri Reddy : శ్రీరెడ్డి నటిగా కంటే వివాదాల వల్లే ఎక్కువ ఫేమస్ అయిన విషయం విదితమే. ఈమె ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అవి వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్‌లో పలు వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ కాలం గడుపుతోంది. ఇక ఇటీవలే మెగా డాటర్ నిహారిక డ్రగ్స్ కేసు విషయంలో శ్రీరెడ్డి.. నాగబాబును కడిగి పారేసింది. నాగబాబు తెల్లారి లేస్తే నీతులు చెబుతారని.. కానీ సొంత కుమార్తెను సరిగ్గా పెంచలేదని ఫైర్ అయింది. ఇక శ్రీరెడ్డి సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తుంటుంది.
పవన్ కల్యాణ్ అంటే అంత ఎత్తున లేచి పడే శ్రీరెడ్డి రాజకీయాల పరంగా సీఎం జగన్‌ను అభిమానిస్తుంది. గతంలోనే ఈ విషయం గురించి ఆమె పలు మార్లు చెప్పింది. తనకు వైఎస్సార్ అంటే ఇష్టమని.. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ అంటే ఇంకా ఇష్టమని శ్రీరెడ్డి తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనధికారికంగా మద్దతు ఇస్తుంటుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులకు తన సపోర్ట్ తెలుపుతుంటుంది. మరోవైపు వైసీపీని టార్గెట్ చేసే వారిపై కామెంట్లు కూడా చేస్తుంటుంది. అయితే శ్రీరెడ్డి తాజాగా సీఎం జగన్‌కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది.
శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం వైఎస్ జగన్‌కు చెందిన ఒక పాత ఫొటోను షేర్ చేసింది. దానికి కాప్షన్ కూడా పెట్టింది. స్టిల్ విత్ యు అన్నా.. అంటే.. ఇప్పటికీ మీతోనే ఉన్నా అన్నా.. అని కాప్షన్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.
అయితే శ్రీరెడ్డి వైకాపాకు మద్దతుగానే ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే.. కానీ ఆమె ఇంత సడెన్‌గా ఎందుకు ఆ పోస్ట్ పెట్టింది.. అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…