Chicken Biryani : చికెన్ బిర్యానీ.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి. చికెన్ బిర్యానీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో లభించే బిర్యానీ అయితే చాలా ఫేమస్. హైదరాబాద్‌కు వెళితే అక్కడి బిర్యానీని తినాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బిర్యానీ ధర మామూలుగా అయితే ప్లేట్‌కు రూ.200కు పైమాటే ఉంటుంది. ఒక మోస్తరు హోటల్స్ అయినా సరే.. కనీసం రూ.150 వరకు చెల్లించాల్సిందే. కానీ రూ.55కే అతను బిర్యానీని విక్రయిస్తున్నాడు. అవును.. మీరు విన్నది నిజమే.
రూ.55కే ఒక ప్లేట్ బిర్యానీని తినవచ్చు. అయితే మరీ అంత తక్కువ ధర ఏంటి ? కల్తీ వస్తువులతో తయారు చేసి విక్రయిస్తారా ? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. కానీ అది నిజం కాదు. స్వచ్ఛమైన అసలు సిసలైన పదార్థాలతో బిర్యానీని తయారు చేసి విక్రయిస్తారు. మరి రేటు ఎందుకు అంత తక్కువ అంటే.. అక్కడే ఉంది అసలు కథ.
రేటు తక్కువ అంటే సహజంగానే ఎవరైనా సరే ఎక్కువగా కొంటారు. బిర్యానీ మనకు బయట చాలా ఎక్కువ రేటు ఉంటుంది. కానీ చాలా తక్కువ ధరకే అలాంటి నాణ్యతతోనే బిర్యానీ లభిస్తే.. అప్పుడు ఆ బిర్యానీని ఎక్కువ మంది కొంటారు. దీంతో బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. కనుక తక్కువ ధరకు అమ్మినా ఫర్వాలేదు. మార్జిన్ వస్తే చాలు.. అదీ అసలు కథ. అందుకనే ఆ బిర్యానీ సెంటర్ వారు కేవలం రూ.55కే ఒక ప్లేట్ చికెన్ బిర్యానీని విక్రయిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్ హైదరాబాద్‌లో ఉంది. పేరు కాకా 55 బిర్యానీ.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాకు వెళ్తే.. కాకా 55 బిర్యానీ స్పాట్ అంటే ఎవరైనా చెబుతారు. అంతలా ఈ బిర్యానీ పాయింట్ ఫేమస్ అయింది. ఇక వీరు సాధారణ రోజుల్లో రోజుకు 600 ప్లేట్ల వరకు బిర్యానీని విక్రయిస్తారు. మధ్యాహ్నం, రాత్రి వేర్వేరుగా వండి వడ్డిస్తారు. ఇక సెలవు రోజుల్లో అయితే రోజుకు సుమారుగా 1000 ప్లేట్ల బిర్యానీని విక్రయిస్తారు. ఒక ప్లేట్ బిర్యానీ ధర రూ.55. వారికి చేసేందుకు, ఇతర ఖర్చులు కలిపి రూ.38 ఖర్చవుతుంది. రూ.17 మార్జిన్ లభిస్తుంది. అయినప్పటికీ రోజుకు 600 ప్లేట్లు అమ్మితే.. రూ.10,200 వస్తాయి. నెలకు రూ.3.06 లక్షలు అన్నమాట. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకే ఇలాంటి ఆదాయం వస్తుంది. కానీ బిర్యానీ అమ్ముతూ కూడా ఈ సెంటర్‌వారు రూ.లక్షలు గడిస్తున్నారు. పనిలేదని, ఉద్యోగం దొరకలేదని నిరాశకు గురవకుండా తమ కాళ్లపై తాము నిలబడ్డారు. వీరు ఎంతో మందికి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…