Sri Lakshmi : తెలుగు సినీ ప్రేక్షకులకు హాస్య నటి శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ముఖం చూస్తేనే నవ్వుకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఈమె అనేక సినిమాల్లో బ్రహ్మానందంతో కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. అనేక చిత్రాల్లో ఈమె చక్కని కమెడియన్ గా గుర్తింపు పొందారు. ఇప్పటికీ పలు సినిమాలలో, సీరియల్స్‌లో నటిస్తూనే ఉన్నారు. ఇక ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలోనూ ఈమె కనిపిస్తున్నారు.
అయితే శ్రీలక్ష్మి ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించారు. కానీ ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆమె తండ్రి అమర్‌నాథ్. అప్పట్లో నిర్మాత. కానీ వీరి కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయింది. దీంతో సినిమాల్లో నటించి కుటుంబాన్ని గట్టెక్కించాలనే అప్పట్లో తాపత్రయ పడింది. అయితే ఆమె గర్భం ధరించినప్పటికీ కుటుంబ బాధ్యతలు ఉన్నందున పిల్లలు వద్దనుకుంది. తరువాత కనవచ్చులే కదా అని అనుకుంది. కానీ అదే ఆమెకు శాపమైంది. ఆమెకు పిల్లలు లేకుండా పోయారు.
అప్పట్లో ఈమె చేసిన తప్పుకు ఈమెకు మళ్లీ పిల్లలు కలగలేదు. అనారోగ్య సమస్యలు, థైరాయిడ్ బాధించాయి. దీంతో పిల్లలు కలగలేదు. అదొక్కటే తనకు తీరని విషాదం అని ఈమె చెబుతుంటుంది. ఇక ఈమె సోదరుడు రాజేష్ హీరోగా నటించారు. ఈయన కుమార్తె ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇలా అందరినీ ఎంతో కడుపుబ్బా నవ్వించిన శ్రీలక్ష్మి జీవితంలో ఇంతటి విషాదం ఉందన్న సంగతి ఇంకా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఆమె గురించి తెలిసిన వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…